కరోనాతో మరణించాడన్న అనుమానంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని ఊరిలోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్తులు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజి పల్లి కి చెందిన ఎల్లయ్య అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మృతి చెందాడు. దీంతో అతడు కరోనాతోనే మరణించాడన్న అనుమానంతో గ్రామస్థులు మృతదేహాన్ని ఊర్లోకి తీసుకు వచ్చేందుకు అభ్యంతరం తెలిపారు. దాదాపు గంట సేపు మృతదేహం ఊరి బయటే ఉంది. చివరకు సర్పంచ్ చొరవతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

.
