మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ.. కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులు

మంత్రి మల్లారెడ్డికి మరోసారి నిరసన సెగ.. కాన్వాయిని అడ్డుకున్న గ్రామస్తులు

మంత్రి మల్లారెడ్డికి మరోసారి సొంత ఇలాకాలో నిరసన సెగ తగిలింది. మూడు చింతలపల్లి మండలంలోని పలు గ్రమాల్లో పర్యటించిన మంత్రి మల్లారెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉషారుపల్లి గ్రామంలో మంత్రి కాన్వాయిని మహిళలు ఆపారు. ఉషారుపల్లి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు అద్వానంగా ఉన్నాయంటూ మంత్రిపై ఫైర్ అయ్యారు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మా గ్రామం గుర్తస్తుందా అంటూ మంత్రిని నిలదీశారు. డబుల్ బెడ్ రూంలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీలు ఏం అయ్యాయని ప్రశ్నించారు. సొంత ఇండ్లు లేక పేదవారు ఇబ్బందులు పడుతున్నారని.. స్థానికులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. 

ALSO READ:ప్రగతిభవన్ కు స్టేషన్ ఘన్ పూర్ లొల్లి.. కేటీఆర్ తో తాటికొండ రాజయ్య భేటీ

ఈ క్రమంలో మంత్రికి గ్రామస్తులు తమ డిమాండ్లు, సమస్యలు వివరిస్తుండగా.. మధ్యలో పోలీసులు, కొందరు బీఆర్ఎస్ నాయకులు కల్పించుకుని వారిని దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చెలరేగింది.