
కొత్తగూడ, వెలుగు: ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో జనశక్తి నక్సలైట్ భరత్ 25వ వర్ధంతి సభకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి హాజరై మాట్లాడారు. విప్లవకారులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. విప్లవకారుల్లో చీలికతోనే శత్రువు బలం పెంచుకుంటున్నాడని పేర్కొన్నారు.
ప్రజలను పీడిస్తున్న వారు మాత్రం ఒక్కతాటిపై ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపరేషన్ కగార్తో ఎంతో మంది విప్లవకారులను కోల్పోయామని వాపోయారు. భరత్ కొడుకు పెద్ద కుమార్, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మండల వెంకన్న,సీపీయూఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న, సూర్య పాల్గొన్నారు.