మణిపూర్​ లో మహిళల పై దాడులు దారుణం : విమలక్క

మణిపూర్​ లో మహిళల పై దాడులు దారుణం : విమలక్క

నల్గొండ అర్బన్, వెలుగు :  బేటీ  బచావో అని నినాదాలిచ్చే బీజేపీ మణిపూర్​లో మహిళలపై జరుగుతున్న దాడులపై మాట్లాడక పోవడం దారుణమని అరుణోదయ గౌరవాధ్యక్షురాలు విమలక్క  అన్నారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో మణిపూర్ లో మహిళల పరిస్థితిపై  జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  అమానవీయ ఘటనలు జరుగుతుంటే పార్లమెంట్ లో మణిపూర్ విషయాన్ని చర్చకు రానివ్వకపోవడం  దారుణమన్నారు.  

కార్యక్రమంలో  ప్రజా సంఘాల నాయకులు పాలడుగు నాగార్జున, పందుల సైదులు, కట్టా భగవంత రెడ్డి, బొమ్మకంటి కొమురయ్య, పల్లేబోయిన జానీ, బెల్లి నాగరాజు, బాబురావు, మంగ, చింతమల్ల గురూజీ, క్రిస్టపర్, ప్రభు చరణ్, పి.జేమ్స్, బి.ప్రదీప్, సామ్యూల్, లక్ష్మయ్య, నవనీత్, శ్యాంసుందర్, ఆశీర్వాదాం, మానుపాటి బిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.