కేటీఆర్..కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూస్తరు: వినయ్ భాస్కర్

కేటీఆర్..కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూస్తరు: వినయ్ భాస్కర్

మంత్రి కేటీఆర్.. పార్టీ కార్యకర్తలను కుటుంబసభ్యుల్లా చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బలహీన వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే వారి కోసం 600 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని అన్నారు. హనుమకొండ జిల్లా మణికొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్ భాస్కర్ తో పాటు, మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మణికొండలోని 26 వార్డుల్లో రూ.260.1 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేశామని వినయ్ భాస్కర్ చెప్పారు. రూ.303 కోట్ల రూపాయలతో  నిర్మించిన 505 ఇండ్లను రాబోయే వారం రోజుల్లో అర్హులకు అందిస్తామని తెలిపారు. 

బీసీలను అగౌరవ పరిచే విధంగా బీజేపీ చర్యలు ఉంటున్నాయని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. మునుగోడు ఎన్నికల తర్వాత దేశ ప్రజలందరు కేసీఆర్ వైపే చూస్తున్నారని ఆయన చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీలను చైతన్యపరచడం కోసం రౌండ్ టేబుల్ సమావేశా లు నిర్వహిస్తామని తెలిపారు. -ఈడీ, ఐటీ దాడులకు తాము భయపడమని.. కేంద్ర ప్రభుత్వ కుట్రలు ప్రజల ముందు పెడుతామని వినయ్ భాస్కర్ ఆరోపించారు.