
- కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్ట ఆలయాభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరయ్యాయని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి తెలిపారు. టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ మేరకు గుట్టపై కాటేజ్ల నిర్మించనున్నట్లు చెప్పారు. ఆర్మూర్ టౌన్ శివారులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి మందిరం పనులను మంగళవారం వినయ్ రెడ్డి పరిశీలించి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం ద్వారా మందిర నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. తనవంతుగా రూ.లక్ష విరాళంగా అందజేశారు.
సిద్ధులగుట్ట అభివృద్ధికి నిధులు మంజూరు చేయించిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆర్మూర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోండ్ల సంతోష్, ఆలయ కమిటీ అధ్యక్షుడు గాజం మచ్ఛేందర్ తదితరులు
పాల్గొన్నారు.