ఖమ్మంసిటీలో ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ!

ఖమ్మంసిటీలో ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ!

ఖమ్మంలో ఆవుపేడతో వినాయక విగ్రహాలుఖమ్మం సిటీలోని టేకులపల్లి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోశాలలో ప్రధాన అర్చకులు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు వినుత్నంగా ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తయారీకి పేడ తో పాటు రంపపు పొట్టు, జాస్మిన్ పౌడర్, ప్రకృతి సిద్ధమైన కలర్లను వాడుతున్నారు. 

ఈ విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోవడమే కాకుండా, ఆవు పేడ చేపలకు ఆహారంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్కో విగ్రహం రూ. 100కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం