
వినాయకచవితి ఉత్సవాలు దగ్గరపడుతున్నాయి. దాదాపు ప్రతి వీధిలో వినాయక మండపాలు స్థాపిస్తారు. అయితే అక్కడ అందరు ఎవరికి వారే ప్రత్యేకంగా కనపడాలని ప్రయత్నిస్తుంటారు. దీకికోసం మేకప్ వేసుకొని చాలా అందంగా కనపడుతుంటారు. బొజ్జ గణపయ్య వస్తూవస్తూనే బోలెడన్ని వేడుకల్ని వెంటపెట్టుకొచ్చాడు. ఒకటా రెండా తొమ్మిది రోజుల సంబరాలు, ఊరంతా ఒకచోట చేరి సందడి చేస్తారు. మరి ఇలాంటి సమయంలో రొటీన్‌గా రెడీ అయితే ఏం బాగుంటుంది. అందుకే సహజ అందానికి కాస్త మేకప్ హంగులు అద్దండి. మరీ ముఖ్యంగా కళ్ల మీద దృష్టి పెట్టండి. ట్రెడిషనల్ లుక్‌కి మ్యాచ్ అయ్యేలా కళ్లకు రంగులద్దితే వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ మీరే అవుతారు.
కళ్లు చిన్నదైనా, పెద్దవైనా స్పెషల్ లుక్ రావాలంటే కాటుక పెట్టుకోవాల్సిందే. అందుకోసం నాణ్యమైన ఐ–లైనర్‌ని ఎంచుకోవాలి. దీన్ని వాడేముందు కళ్ల చుట్టూ టిష్యూతో ఓసారి తుడవాలి. ఆపై ఐ-లైనర్ అపుల్ లైన్ గీసు కోవాలి. కనురెప్పలకు దగ్గరగా గీయడం వల్ల సహజంగా కనిపించొచ్చు. వయసు. రంగుని బట్టి నలుపు, బ్రౌన్, గ్రే రంగులో ఉండే ఐ-లైనర్ లను ఎంచుకోవచ్చు.
ALSO READ | Good Health : మహిళలు స్నానానికి వేడి నీళ్లు మంచివా.. చల్లటి నీళ్లు మంచివా..
కళ్లకు మస్కారా వేసుకునేటప్పుడు కనురె ప్పల మీద జాగ్రత్తగా వేయాలి. అది అరక ముందే ఐలాషెన్ తో వంపు తిప్పాలి . పూర్తిగా ఆరిన తరువాత అలా చేస్తే కనురెప్పలకు ఉన్న వెంట్రుకలు రాలిపోతాయి. అలంకరణ అంతా అయ్యాకే ఐషాడో వాదాలి. ఇలా చేయడం వల్ల కళ్లు తాజాగా కనిపిస్తాయి. కళ్లు మంచిగా కనిపించాలం టే లేత రంగుల్లో ఉండే ఐషాడోని ఎంచుకో వాలి. కొన్నిసార్లు ముదురు రంగులు కూడా బాగుంటాయి. కళ్లను మరింత హైలైట్ చేస్తాయి.
కళ్ల మేకప్ చెదరకుండా....కొన్నిసార్లు చెమట తడిగాలి వంటివాటి వల్ల కళ మేకప్ పోతుంటుంది. అలా కాకుండా. ఉండాలంటే మొదటగా కళ్ల చుట్టూ మాయిశ్చరైజర్ రాసుకొని బాగా మర్దనా చేసుకోవాలి. చేతి వేలితో ఫేస్ క్రీమ్‌ని రాసుకొని దానిపై చర్మంలో కలిసిపోయేట్టుగా పౌడర్ రాసుకోవాలి తరువాత స్పాంజ్ తో ఐషాడో వేసుకోవాలి. దానిపై ట్రాన్స్ లు సెంట్ పౌడర్ని పలుచగా రాసుకోవడం వల్ల ఐ-షాడో చాలా సేపటివరకు తాజాగా ఉంటుంది. పెన్సిల్‌తో వేసుకున్న దాని కన్నా లిక్విడ్ వాటర్ ప్రూఫ్ లైనర్ తో వేసుకున్న ఐ-లైన్ మేకప్ ఎక్కువ గంటల గంటలు ఉంటుంది. అందువల్ల దానితోఐ-లైన్ వేసుకోవాలి.
కనురెప్పల వెంట్రుకలను వంపు తిప్పడం వల్ల మస్కారా చాలాసేపు చెదరకుండా ఉంటుంది. కళ్లరు ప్రైమర్ వేసాక కాస్త జిడ్డుగా అనిపిస్తుంది. టేమ్యాటీ పౌడర్ అద్దాలి. ఇలా చేయడం వల్ల మేకప్ తాజాగా కనిపిస్తుంది. వాటర్ ప్రూఫ్ ఐ–లైనర్ షాడో, మస్కారా, అండర్ ఐ-కన్నీ లర్లు వాడటం వల్ల ఐ-మేకప్ తొందరగా చెరిగిపోదు.
ఇలా తొలగించుకోండి
చాలామంది ఐ-మేకప్ ని తొలగించుకోవడానికి రిమూవింగ్ క్రీమ్స్ వాడుతుంటారు. కానీ వాటి కలిగిస్తాయి. అందుకే. సహజ పద్ధతిలో మేకప్ తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. అదెలా అంటారా? పావు కప్పు పెరుగులో రెండు చుక్కల అలివ్ నూనెను కలపాలి. ఆ మిశ్రమంలో దూది ముంచి మేకప్ తుడిచేయొచ్చు.