ఈ నెలలోనే వినాయక చవితి పండుగ : శుభ ముహూర్తంఏంటీ.. ఏ సమయంలో పూజ చేయాలి..!

ఈ నెలలోనే వినాయక చవితి పండుగ : శుభ ముహూర్తంఏంటీ.. ఏ సమయంలో పూజ చేయాలి..!

శ్రావణమాసం ఆగస్టు 23తో ముగియనుంది.. ఇక 24 నుంచి భాద్రపదమాసం ప్రారంభం కానుంది..  ఈ మాసం మొదటి వారంలో పిల్లలు.. పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. ఏమిటి అనుకుంటున్నారా.. అదేనండి.. ఏ పూజ చేసినా.. ఏ నోము నోచినా.. విఘ్నాలు తొలగించే వినాయకచవితి పండుగ ఈనెల  ఆగస్టు 27నజరుపుకుంటున్నాము.. ఈ ఏడాది ఏసమయంలో విఘ్నేశ్వరుడిని పూజించాలి.. శుభ ముహూర్తఘడియలు ఎప్పుడు ఉన్నాయి.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. . . 

ప్రతి సంవత్సరం వినాయకచవితి పండుగను భాద్రపదమాసం శుక్లపక్షం.. చవితి తిథి రోజున జరుపుకుంటారు.  ఈ ఏడాది ఈ నెలలోనే అంటే ఆగస్టు 27న జరుపుకోవాలి.ఆ రోజునుంచి పది రోజుల పాటు అంటే తొమ్మిది రాత్రిళ్లు ..  అంటే అనంత చతుర్ధశి వరకు  ఈ పండుగను జరుపుకుంటాము .  సెప్టెంబర్ 6వ తేదీన భక్తి శ్రద్దలతో పూజించిన మట్టి వినాయకుడిని దగ్గరలో చెరువులలో.. కాలువలలో నిమజ్జనం చేస్తారు. 

ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిధి నాడు వస్తుంది. ఈ పండుగను అనంత చతుర్ధశి తిధి వరకు జరుపుకుంటారు. గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు. వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. విఘ్నేశ్వరుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

శ్రీవిశ్వావశు నామ సంవత్సరం ( 2025) లో  ఆగస్టు 27వ తేదీ వినాయక చవితి (గణేష్‌ చతుర్థి) పండగను జరుపుకుంటారు. . మొత్తం 10 రోజుల పాటు నిర్వహించే వినాయక నవరాత్రిళ్లను ఎంతో  వేడుకగా జరుపుకుంటారు. చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా వైభవంగా ఈ వినాయక చవితిపండుగను సెలబ్రేట్‌ చేసుకుంటారు.

వినాయక చతుర్థి చవితి ఘడియలు & విగ్రహ ప్రతిష్టాపన సమయం 

చతుర్థి తిథి ప్రారంభం       :     ఆగస్టు 26  మధ్యాహ్నం 01:54
చతుర్థి తిథి ముగింపు          :     ఆగస్టు 27 మధ్యాహ్నం 03:44
పూజా ముహూర్త సమయం  :     ఆగస్టు 27 ఉదయం 11:05 గంటల  నుంచి మధ్యాహ్నం 01:40 గంటల వరకు

వినాయకుడి  విగ్రహాన్ని ప్రతిష్ఠించి, పూజను నియమ, నిష్టలతో చేయడం వల్ల గణేశుడి అనుగ్రహం లభిస్తుంది.  వినాయకుడిని పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్టించడం ఎంతో శ్రేయస్కరం. రసాయన రంగులు కలిపిన విగ్రహాలను వినియోగించకపోవడం మంచిది. అలాగే వినాయకుడు కూర్చున్న భంగిమలో వాహనం అయిన ఎలుక విగ్రహానికి దగ్గర్లోనే ఉండేలా చూసుకోవాలి.

పురాణాల ప్రకారం  బాధ్రపదమాసం శుక్ల పక్షం చతుర్థి ( ఆగస్టు 27) రోజున వినాయకుడిని  పూజిస్తే విఘ్నాలు తొలగించి.. అదృష్టం.. శ్రేయస్సు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.  తొమ్మిది రాత్రుళ్లు ... ప్రతిరోజూ పూజలు చేస్తారు.  వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన మండపంలో భక్తులు   భజనలు చేస్తూ ఆడిపాడతారు. వినాయకుడిని నిష్టగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం. ఎందుకంటే ఈ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుకు సాగుతుందని నమ్మకం. అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురుకావని పండితులు చెబుతారు.