ఏషియన్ గేమ్స్ లో వినేశ్‌‌‌‌కు చుక్కెదురు..53 కేజీల సెమీస్ లో ఓటమి..

ఏషియన్ గేమ్స్ లో వినేశ్‌‌‌‌కు చుక్కెదురు..53 కేజీల సెమీస్ లో ఓటమి..

ఇండియా స్టార్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ వినేశ్‌‌‌‌ ఫోగట్‌‌‌‌కు.. ఆసియా క్రీడల ట్రయల్స్‌‌‌‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌ 53 కేజీల సెమీస్‌‌‌‌లో వినేశ్‌‌‌‌ 4-6తో మీనాక్షి గోయట్‌‌‌‌ చేతిలో ఓడింది. దాంతో ఆసియా క్రీడలతో రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఆమె ఆశలు ఫలించలేదు.

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోగట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు.. ఆసియా క్రీడల ట్రయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 53 కేజీల సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4–6తో మీనాక్షి గోయట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది. దాంతో ఆసియా క్రీడలతో రీ ఎంట్రీ ఇవ్వాలన్న ఆమె ఆశలు ఫలించలేదు. బౌట్ ఆరంభంలో వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగైన టక్నిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ చివర్లో మీనాక్షి పట్టువదలకుండా పోరాడి విజయం దక్కించుకుంది. 

అయితే తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7–1తో జ్యోతిపై ఈజీగా నెగ్గిన వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిషు కుమారి నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఓ దశలో నిషు 5–0 ఆధిక్యంలో నిలిచింది. నిషు పట్టుకు స్టామినా కోల్పోయిన వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాదాపుగా కిందపడే స్థాయికి వెళ్లింది. కానీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా స్క్రీన్లలో సాంకేతిక లోపాలు తలెత్తడం, సవాళ్లు ఎదురుకావడంతో లభించిన విరామాలను ఉపయోగించుకున్న వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రమంగా పుంజుకుంది. నిషును మ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి విసిరి ఒకేసారి నాలుగు పాయింట్లు సాధించింది. 

ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భర్త సోంబీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాఠీ, ఇతర మద్దతుదారులు ‘పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫలితం ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. రెఫరీ తప్పుడు విజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసినట్లు తేలడంతో వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్లు దక్కలేదు. ఆ తర్వాత లభించిన పాయింట్లతో స్కోరు 6–6తో సమమైంది. రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకారం హైయెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరింగ్ మూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజేతగా ప్రకటించడంతో సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించింది. ఓటమి తర్వాత మరో రెండేళ్ల పాటు ఆటలో కొనసాగుతానని వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ఇదే కేటగిరీలో అంతిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3–2తో మీనాక్షిపై గెలిచి ఆసియా క్రీడలకు అర్హత సాధించింది.