విన్‌‌‌‌ఫాస్ట్ మొదటి షోరూమ్ సూరత్‌‌‌‌లో ప్రారంభం

విన్‌‌‌‌ఫాస్ట్ మొదటి షోరూమ్ సూరత్‌‌‌‌లో ప్రారంభం
  •  ఏడాది చివరి నాటికి  27 సిటీల్లో 35 డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లు 


న్యూఢిల్లీ: వియత్నమీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ విన్‌‌‌‌ఫాస్ట్  ఇండియాలోని తన మొదటి షోరూమ్‌‌‌‌ను  గుజరాత్‌‌‌‌లోని సూరత్‌‌‌‌లో ప్రారంభించింది. దీనిని చందన్ కార్ డీలర్‌‌‌‌‌‌‌‌షిప్ నిర్వహిస్తోంది. ఇక్కడ వీఎఫ్‌‌‌‌ 6, వీఎఫ్‌‌‌‌ 7 ఎలక్ట్రిక్ ఎస్‌‌‌‌యూవీలను ప్రదర్శిస్తారు. భారత్‌‌‌‌లో రైట్-హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌‌‌‌లు మొదటిసారిగా లాంచ్ అవుతున్నాయి. ఈ కార్లను  తమిళనాడు తూత్తుకుడిలో ఏర్పాటు చేయబోయే కంపెనీ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తారు. 

సూరత్‌‌‌‌లోని పిప్లోడ్‌‌‌‌లో ఉన్న ఈ షోరూమ్, కస్టమర్ హబ్‌‌‌‌గా పనిచేస్తుంది.  కొనుగోలు, ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌‌‌‌లు ఇక్కడ దొరుకుతాయి.  కాగా, విఎఫ్‌‌‌‌ 6,7 కార్ల కోసం ఇండియాలో ఈ నెల 15  నుంచి రూ.21 వేల రీఫండబుల్ డిపాజిట్‌‌‌‌తో ప్రీ-బుకింగ్‌‌‌‌లు ప్రారంభమయ్యాయి. విన్‌‌‌‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ ఈ షోరూమ్ భారత్‌‌‌‌పై తమ నిబద్ధతను సూచిస్తుందని,  నాణ్యమైన సర్వీస్‌‌‌‌లను అందిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 27 కి పైగా నగరాల్లో 35 డీలర్‌‌‌‌షిప్‌‌‌‌లను ప్రారంభిస్తామని అన్నారు.