అబిడ్స్ లో వింటేజ్ కార్ల ప్రదర్శన

అబిడ్స్ లో వింటేజ్ కార్ల ప్రదర్శన

రిపబ్లిక్ డే సందర్భంగా అబిడ్స్​లోని చర్మస్ గ్రూప్స్ యజమాని కెప్టెన్ కెఎఫ్ పేస్తోంజి తన వద్ద ఉన్న వింటేజ్ కార్లు, బైక్స్​తో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు.  1931 నుంచి సేకరించిన బెంజ్, రోల్స్ రాయల్స్ మోడళ్లతో పాటు పలు వినూత్న కార్లు, బులెట్ బైక్స్​ను ఆయన ఇంటి ముందు ఉంచారు. 

వాటితో ఫొటోలు దిగేందుకు ప్రజలు పోటీపడ్డారు. నేషనల్ కార్ రైసర్ అయిన ఆయన తనకు వింటేజ్ కార్లు కొనడం హాబీగా ఉండేదన్నారు. సినిమా నిర్మాతలు షూటింగ్ కోసం అద్దెకు తీసుకెళ్తారని ఆయన వెల్లడించారు. - బషీర్​బాగ్, వెలుగు