ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లు..అట్టుడికిన వీధులు..బస్సులకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లు..అట్టుడికిన వీధులు..బస్సులకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

ఫ్రాన్స్లో బుధవారం(సెప్టెంబర్10) అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఆందోళనకారులు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పై ఒత్తిడి పెంచేందుకు పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. బస్సులను తగలబెట్టారు.. రోడ్లను బ్లాక్ చేశారు..దుకాణాలను ధ్వంసం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు మూకలను అడ్డుకునేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో భారీ హింస చేలరేగింది. ఈ ఘటనలో 200 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. 

నిరసనలకు ప్రధాన కారణాలు

ప్రభుత్వ ఆర్థిక విధానాలు.. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
కొత్త ప్రధానమంత్రి నియామకం..ప్రెసిడెంట్ మాక్రాన్ తన సన్నిహితుడైన సెబాస్టియన్ లెకోర్నును కొత్త ప్రధానమంత్రిగా నియమించడం ప్రజల ఆగ్రహానికి మరో ముఖ్య కారణం. బుధవారం లెకోర్ను తన పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.

ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా,  ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తన సన్నిహితుడు అయిన సెబాస్టియన్ లెకోర్నును ప్రధానమంత్రిగా నియమించడంతో  దేశవ్యాప్తంగా ఆందోళనకారులు బ్లాక్ ఎవ్రీథింగ్ నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు దాదాపు 80వేల మంది పోలీసులు మోహరించారు. ఆందోళనకారులకు,పోలీసులతో ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఫ్రాన్స్ రాజధానితోపాటు దేశమంతా స్తంభించిపోయింది. 

ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా సెబాస్టియన్ లెకోర్ను ఎన్నికోవడం, ఆయన బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించడం.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై స్థానిక వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో చెలరేగిన ఆందోళనలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. స్కూళ్లు, కాలేజీలు అన్ని బంద్ చేశారు. ఇతర ప్రజా సేవలు స్తంభించిపోయాయి. మాక్రాన్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు వీధుల్లోకి రావడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వందల మందిని అరెస్ట్ చేశారు.