జింబాబ్వేలోనూ  వియోనా ఫిన్టెక్ సేవలు

జింబాబ్వేలోనూ  వియోనా ఫిన్టెక్ సేవలు

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్​పీసీఐ సర్టిఫైడ్ సాంకేతిక సేవల సంస్థ వియోనా ఫిన్​టెక్ తన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆఫ్రికా మార్కెట్లకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా జింబాబ్వేలో ట్యాప్ అండ్ పే ప్లాట్​ఫామ్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

వ్యాపారులు ప్రత్యేకంగా పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు కొనాల్సిన అవసరం లేకుండా, ఎన్​ఎఫ్​సీ ఆధారిత సాఫ్ట్ పోస్ ద్వారా స్మార్ట్​ఫోన్లనే చెల్లింపుల టెర్మినల్స్​గా మార్చే టెక్నాలజీని అందిస్తోంది.  యూపీఐని వాడుకోవడానికి జింబాబ్వే సెంట్రల్ బ్యాంకుతో ఎన్​పీసీఐ చర్చిస్తున్న నేపథ్యంలో వియోనా ఈ విస్తరణ చేపట్టింది.  జింబాబ్వేలో నెలకు 200 బిలియన్లకు పైగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. చిన్న  వ్యాపారులకు తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ సేవలు అందించడమే తమ లక్ష్యమని వియోనా వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ తెలిపారు.