వైరల్‌: పుట్టగానే మాస్క్ ను తొలగిస్తూ.. కరోనాతో కమ్ముకున్న చీకట్లను చీల్చుకుంటూ

వైరల్‌: పుట్టగానే మాస్క్ ను తొలగిస్తూ.. కరోనాతో కమ్ముకున్న చీకట్లను చీల్చుకుంటూ

కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గతేడాది డిసెంబర్ నుంచి  కోట్లాది మంది ప్రజల గుండె ల్లో దడపుట్టిస్తూ నేటికీ విజృంభిస్తూ కరోనాతో కమ్ముకున్న చిమ్మి చీకట్లను చీల్చుకుంటూ ప్రపంచానికి వెలుగు నింపే రోజులు దగ్గర పడ్డాయనే నమ్మకాన్ని కలిగించింది అప్పుడే పుట్టిన పసిపాపాయి.

యూఏఈకి చెందిన డాక్టర్‌ సమీర్‌ చీబ్ గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఆస్పత్రిలో ఓ గర్బిణీకి డెలివరీ చేశారు. ఈ డెలివరీ సందర్భంగా ఫోటో తీశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అక్టోబర్ 5న మనమందరం అందరం త్వరలో ముసుగు తీయబోతున్నాం అంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియా పోస్ట్ చేశారు.

కరోనా చిమ్మి చీకట్లను చీల్చుకుంటూ ప్రపంచానికి వెలుగు నింపే రోజులు రాబోతున్నాయంటూ అప్పుడే పుట్టిన పసికందు డాక్టర్ ధరించిన మాస్క్ ను తొలగించింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ కాగా..బహుశ ఆ పసికందు అలసిన ప్రపంచానికి నమ్మకాన్ని కలిగించేందుకు ఇలా చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

We all want sign are we going to take off the mask soon ??

Dr Samer Cheaib ,Obstetrics & Gynecology , Pregnancy Care in Dubai यांनी वर पोस्ट केले सोमवार, ५ ऑक्टोबर, २०२०