సిద్దిపేటలో మందుబాబు హల్ చల్

సిద్దిపేటలో మందుబాబు హల్ చల్

సిద్దిపేటలో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మద్యం మత్తులో రోడ్డు పక్కన ఉన్న బిల్‌ బోర్డు ఫ్రేమ్కు వేలాడుతూ కనిపించాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులు న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి ఫుల్ గా మద్యం సేవించి ఉన్నాడని.. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగిందని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత వెల్లడించారు. ఆ వ్యక్తి మత్తులో ఇలా చేశాడు తప్పా.. డబుల్ బెడ్‌రూమ్ ఇంటి కోసం గురించి కాదన్నారు.