సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు

సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు

కొన్ని సార్లు ఎంత బలవంతుడైనా పరిస్థితులు తారుమారైతే.. తలవంచాల్సిందే. జంతువులకు రారాజుగా పిలుచుకునే సింహం.. జింక, మేక లాంటి ఎన్నో జంతువులను వేటాడుతుంది. కానీ కొన్ని సార్లు అది కూడా చిన్న చిన్న జంతువులకు భయపడి పరిగెత్తిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. వీధి కుక్కలకు భయపడి ఓ సింహం పరుగు లంకించుకుంది.

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ గ్రామంలోకి రాత్రి సమయంలో ఓ సింహం ప్రవేశించింది. అది గ్రామ వీధుల్లో తిరుగుతుండగా ఓ కుక్కల గుంపు అడవి రాజును తరిమికొట్టింది. పక్కనే ఉన్న ఆవుల మంద వైపు సింహం పరుగెత్తింది. దీనికి సంబంధించిన వీడియోను అటవీ అధికారి సురేందర్ మెహ్రా అనే అధికారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

https://twitter.com/surenmehra/status/1638560160489807873