ఎడారి రాజ్యంలో వరద బీభత్సం

ఎడారి రాజ్యంలో వరద బీభత్సం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఫుజైరాతో పాటు...షార్జాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావటంతో... షాపులు, వాహనాలు నీటమునిగాయి. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న వందల మందిని రక్షించారు. దాదాపు 4 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. 

ఫుజైరాతో పాటు...షార్జాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. పుజైరాలో 25.5 సెం. మీటర్ల వర్షాపాతం రికార్డ్ అవ్వడంతో వీధుల్లో పార్క్ చేసిన కార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మరికొన్ని వరదల్లో కొట్టుకుపోయాయి. రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. వరదల కారణంగా రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గుంతలు పడిన రహదారులపై డ్రైవింగ్ చేయడం వాహనదారులకు చాలా కష్టంగా మారింది. 27 ఏళ్లలో UAEలో ఈ స్థాయిలో వర్షాలు ఎప్పుడు రికార్డ్ కాలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు దుబాయ్, అబుదాబీ నగరాల్లో మాత్రం తేలికపాటి వర్షపాతమే నమోదు అయ్యింది.