భలే ఐడియానే : వెడ్డింగ్ కార్డు తరహాలో ఓటింగ్ పై హోర్డింగ్స్

భలే ఐడియానే : వెడ్డింగ్ కార్డు తరహాలో ఓటింగ్ పై హోర్డింగ్స్

ఇంటర్‌నెట్‌ వినియోగం విచ్చలవిడిగా మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రమైన పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అదే తరహాలో ఒక పెద్ద  వెడ్డింగ్ కార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లి శుభలేఖ వైరల్‌ కావటం ప్రస్తుత కాలంలో మామూలే అయిపోయింది. ఎందుకంటే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. తాజాగా పుణెకు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో   ప్రత్యేకమైన విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా పూణే నగరానికి చెందిన @r/unitedstatesofindia అనే గ్రూప్‌లో వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. ఈ కార్డులో వధూవరుల పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయి.

పెళ్లిళ్ల సీజన్ ముగిసింది.  అయినా కొన్ని పెళ్లిళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.  ఒక పెళ్లిళ్ల సందడి .. మరోపక్క  దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోలాహలం  నెలకొంది.  దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు హోరెత్తిస్తున్నాయి.  ఎన్నికల వెడ్డింగ్​ కార్డు ఫోటో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది.  ఈ వెడ్డింగ్ కార్డ్‌లో ఏ వ్యక్తి పేరు గురించి కాకుండా ఓటర్ల వివాహం, ప్రజాస్వామ్యం గురించి రాసి ఉంది.  ఇది చాలా పెద్ద కార్డ్​ దీనిని తీసుకెళ్లడానికి ట్రక్​ అవసరం అని రాసి ఉంది. 

  ఇక వధువు, వరుడు వివరాలకొస్తే అందులో అబ్బాయి పేరు ఓటర్​అని.. అమ్మాయి పేరు లోక్​ శతి అంటే ప్రజాస్వామ్యం అని రాశారు.   వివాహ తేది మే 13.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ( ఇది పుణె నగరంలో ఎన్నికలు జరుగుతేది) ... వివాహ వేదిక.. మీ దగ్గరలోని పోలింగ్​ స్టేషన్​ అని రాశారు.  సోషల్​ మీడియాలో ఈ పెళ్లి కార్డు వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు.  అమ్మాయి.. వధువు.. ( ప్రజాస్వామ్యం) ఇప్పటికే అబ్బాయిని.. వరుడిని ( ఓటర్​) మోసం చేస్తోందని సరదాగా కామెంట్​ చేశారు.   కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే జరిమానా విధిస్తారని ఒకరు పోస్ట్​ చేశారు. సోషల్​ మీడియాలో ఇలాంటి స్పెషల్​ వెడ్డింగ్​ వైరల్​ అవుతున్నాయి.