అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు (18 డిసెంబర్ గురువారం) నుండి గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్ (డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్)ను ఆపేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కిందే MIT, బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన నిందితులను అమెరికాలోకి అనుమతించారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా పౌరసత్వం & ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రమాదకరమైన వ్యక్తులని మన దేశానికి రావడానికి ఎప్పటికీ అనుమతించకూడదని క్రిస్టి నోయెమ్ అన్నారు.
గ్రీన్ కార్డ్ లాటరీ కార్యక్రమం:
బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు జరిపిన క్లాడియో వాలెంటే 2017లో డైవర్సిటీ లాటరీ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ (DV1) ద్వారా అమెరికాలోకి ప్రవేశించి గ్రీన్ కార్డ్ పొందాడు. ఇలాంటి దారుణమైన వ్యక్తులని మన దేశంలోకి ఎప్పటికీ అనుమతించకూడదు" అని రాస్తూ క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా Xలో పోస్ట్ షేర్ చేశారు. 2017లో కూడా DV1 ప్రోగ్రామ్ కింద దేశంలోకి ప్రవేశించిన ISIS ఉగ్రవాది న్యూయార్క్ నగరంలో ట్రక్కును ఢీకొట్టి ఎనిమిది మందిని చంపాడు అని కూడా ఆమె పేర్కొంది.
కాల్పుల తర్వాత నిర్ణయం :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశం మేరకు, ఈ విధ్వంసక ఘటన వల్ల ఇకపై అమెరిక ప్రజలు ప్రభావం కాకుండా చూసుకోవడానికి DV1 కార్యక్రమాన్ని నిలిపివేయాలని USCISని వెంటనే ఆదేశిస్తున్నాను అని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తెలిపారు. అయితే బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడిన ఘటనలో 48 ఏళ్ల పోర్చుగీస్ పౌరుడైన క్లాడియో నెవెస్ వాలెంటే ఒక MIT ప్రొఫెసర్‌ను హత్య చేసారు. డైవర్సిటీ వీసా లాటరీని ట్రంప్ చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. 2025 నవంబర్‌లో నేషనల్ గార్డులపై జరిగిన ఘోరమైన దాడిలో ఒక ఆఫ్ఘన్ వ్యక్తి దాడికి పాల్పడినట్లు గుర్తించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్‌తో సహా చాల దేశాలపై వలస ఆంక్షలు విధించారు.
►ALSO READ | బంగ్లాదేశ్ లో అల్లర్లు: మీడియా ఆఫీసులను తగలబెట్టిన ఆందోళనకారులు
