క్రీడలను.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

క్రీడలను.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం

క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడం తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆయన గుర్తు చేశారు.  ఎనిమిదేళ్ల అతి చిన్న వయసులోనే కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన విరాట్ చంద్ర ను మంత్రి శ్రీనివాస్ గౌడ్  సత్కరించి అభినందించారు. భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాలను విరాట్ చంద్ర అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. విరాట్ చంద్ర ప్రతిభ స్కూల్ విద్యార్థులకే కాదు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ 

ఘనంగా బీటింగ్ రిట్రీట్.. డ్రోన్ షోతో అగ్ర దేశాల సరసన భారత్

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఆష్లే బార్టీ

పెగాసస్ పై న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం