చాలెంజింగ్ రోల్ చేశా : ప్రగతి శ్రీవాస్తవ

చాలెంజింగ్ రోల్ చేశా :  ప్రగతి శ్రీవాస్తవ

విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘పెదకాపు 1’. సెప్టెంబర్ 29న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ ప్రగతి శ్రీవాస్తవ మాట్లాడుతూ ‘సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ మంచి సస్పెన్స్‌‌తో క్యాచీగా ఉంటుంది. శ్రీకాంత్ గారు కథ చెప్పగానే చాలా ఆసక్తికరంగా అనిపించింది. దీనికోసం నన్ను ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ‘మనుచరిత్ర’ తర్వాత తెలుగులో నేను నటించిన రెండో చిత్రమిది. నటిగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నాకు.. ఇలాంటి చాలెంజింగ్ రోల్ రావడం సంతోషంగా ఉంది. నా పాత్రలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. చాలా సహజంగా ఉంటుంది. ఆ క్రెడిట్ శ్రీకాంత్ గారికే దక్కుతుంది. నాతో పాటు  పాత్రలన్నీ కీలకంగా ఉంటాయి. విరాట్ కర్ణ చాలా సపోర్టివ్ కోస్టార్. తన పాత్రతో, సినిమాతో అందరూ కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం తెలుగులో ‘గంగం గణేశా’ సినిమా చేస్తున్నా. అలాగే ఇంకొన్ని కథలు వింటున్నాను’ అని చెప్పింది.