న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహాయం అందిస్తా మని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు సోమవారం ప్రకటించారు. అయితే ఆ సహాయం ఎంత అనేది విరుష్క జోడీ వెల్లడించకపోయినా.. రూ.3 కోట్లు డొనేట్ చేసినట్టు సమాచారం. ‘ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి మా గుండెలు బరువెక్కుతున్నాయి. మేం చేసే ఈ సహాయం మన తోటివారి బాధలను కొంతైనా తగ్గిస్తాయని ఆశిస్తున్నాం’ అని విరాట్ చెప్పాడు. షూటర్ మను భాకర్, మేరీ కోమ్ చెరో రూ.లక్ష విరాళం ప్రకటించారు.
For More News..
