పాప పుట్టింది.. తను, అనుష్క హెల్తీగా ఉన్నారు

పాప పుట్టింది.. తను, అనుష్క హెల్తీగా ఉన్నారు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనుష్కతోపాటు పాప ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాడు. ‘ఈ మధ్యాహ్నం మాకు ఆడబిడ్డ పుట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. మాపై మీరు చూపిన ప్రేమ, మా కోసం చేసిన ప్రార్థనలు, విషెస్‌‌కు చాలా థ్యాంక్స్. అనుష్కతోపాటు పాప హెల్తీగా ఉన్నారు. మా జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి ఉత్సుకతతో ఉన్నాం. మీరు మా ప్రైవసీని, మా సమయానికి గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని విరాట్ ట్వీట్ చేశాడు.