DC vs RCB: అది గొడవ కాదు.. చిన్న వాదన: రాహుల్‌పై కోహ్లీ సీరియస్.. అసలేం జరిగిందంటే..?

DC vs RCB: అది గొడవ కాదు.. చిన్న వాదన: రాహుల్‌పై కోహ్లీ సీరియస్.. అసలేం జరిగిందంటే..?

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆదివారం (ఏప్రిల్ 27) అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. విరాట్ క్రీజులో ఉన్నప్పుడు రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు ఒకరినొకరు సీరియస్ గా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఈ సీన్ చూసి ఏదో పెద్ద గొడవ జరిగిందనే ప్రచారం చేశారు. అసలు  వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఆర్సీబీ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లే తర్వాత ఇన్నింగ్స్ ను స్లో చేసింది. బంతికి బంతికి మధ్య టైం ఎక్కువగా తీసుకుంది. విప్రజ్ నిగమ్ ఏడో ఓవర్లో నో బాల్ వేయగా కృనాల్ పాండ్య ఫోర్ కొట్టాడు. తర్వాత బంతి ఫ్రీ హిట్ కావడంతో ఢిల్లీ ఫీల్డింగ్ మార్చడానికి టైం తీసుకుంది. రూల్స్ ప్రకారం ఫ్రీ హిట్ సమయంలో లేకపోతే ఆటగాడు నాన్ స్ట్రైకింగ్ కు వెళ్లకపోతే ఫీల్డ్ సెటప్ మార్చకూడదు. కానీ ఢిల్లీ ఫీల్డింగ్ మారుస్తూ టైం వేస్ట్ చేసింది. ఇది విరాట్ కోహ్లీకి నచ్చలేదు. 

ఢిల్లీ ప్లేయర్లపై అసహనంగా కనిపించిన కోహ్లీ.. వికెట్ కీపర్ రాహుల్ దగ్గరకు వెళ్లి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మ్యాచ్ ను ఎందుకు స్లో చేస్తున్నారంటూ రాహుల్ ను అడిగాడు. దానికి రాహుల్ ఏదో సమాధానం ఇస్తూ కోహ్లీని కూల్ చేసేందుకు ట్రై చేశాడు. ఈ సీన్ ను కొంతమంది ఫ్యాన్స్ నెగటివ్ గా వైరల్ చేశారు. కోహ్లీ.. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ గత మ్యాచ్ లో ఓడిపోవడంతో రివెంజ్ తీర్చుకున్నాడాని.. ఢిల్లీ విరాట్ హోమ్ గ్రౌండ్ అని బిల్డప్ ఇచ్చారు. అయితే ఇందులో వాస్తవం లేదు. కోహ్లీ, రాహుల్ మధ్య చక్కని ఫ్రెండ్ షిప్ బాండ్ ఉంది. మ్యాచ్ తర్వాత కూడా కోహ్లీ గ్రౌండ్ లోకి వచ్చి సరదాగా రాహుల్ ను ర్యాగింగ్ చేసి ఆట పట్టించాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ సమిష్టిగా రాణించిన ఆర్సీబీ బౌలర్లు ఆ తర్వాత ఛేజింగ్ లో కృనాల్ పాండ్య (47 బంతుల్లో 73:5 ఫోర్లు, 4 సిక్సర్లు), కోహ్లీ (47 బంతుల్లో 51:4 ఫోర్లు) భారీ భాగస్వామ్యంతో అద్భుతమైన విక్టరీ కొట్టింది. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టేబుల్ టాప్ లోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి గెలిచింది.