IND vs AUS : ఒక్క సెంచరీ కొడితే చాలు.. సచిన్ రికార్డు సమం

IND vs AUS  :  ఒక్క సెంచరీ కొడితే చాలు.. సచిన్ రికార్డు సమం

2023  సెప్టెంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది.  బలాబలాలు చూసుకుంటే రెండు జట్లు హాట్ ఫేవరెట్‌లుగానే బరిలోకి దిగబోతున్నాయి. ఇటీవలి దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 3-2తో ఓటమిని చవిచూసింది, కానీ ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. మరోవైపు టీమిండియా ఇటీవల ఆసియా కప్ ను గెలుచుకుని మాంచి జోష్ లో ఉంది.  

అయితే  ఆస్ట్రేలియాతో జరగబోయే ఈ వన్డే సిరీస్ లో టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఓ రికార్డు ఊరిస్తు్ంది.  అదేంటంటే.. రోహిత్, విరాట్ ఇద్దరూ వన్డేలలో  ఆస్ట్రేలియాపై ఎనిమిది సెంచరీలు నమోదు చేశారు. ఇద్దరు కలిసి చెరో సెంచరీ బాదితే టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ రికార్డును సమం చేసిన వారువుతారు.  సచిన్ ..  ఆస్ట్రేలియాపై 70 వన్డేలలో  44.59 సగటుతో 3 వేల 77 పరుగులతో తొమ్మిది సెంచరీలు, 15 అర్ధ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు.

అయితే  రోహిత్, విరాట్ ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డే మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు.   2023 సెప్టెంబరు 27న రాజ్‌కోట్‌లో జరిగే చివరి వన్డే  మ్యాచ్‌లో జట్టులో చేరనున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ముందుగా  సచిన్ రికార్డును సమం చేస్తారో చూడాలి.  ఒకవేళ ఈ మ్యాచ్ లో మిస్ అయిన  అక్టోబర్ 8న వన్డే ప్రపంచ్ కప్ లో జరగబోయే మ్యాచ్ లో నైనా టెండూల్కర్ రికార్డును సమం చేయడానికి అవకాశం ఉంటుంది.  

ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు:

  • సచిన్ టెండూల్కర్ - 70 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు
  • రోహిత్ శర్మ - 42 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు
  • విరాట్ కోహ్లీ - 44 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు
  • డెస్మండ్ హేన్స్ - 64 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు
  • ఫాఫ్ డు ప్లెసిస్ - 21 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు