BCCI Central Contract: ఆడేది ఒకే ఫార్మాట్.. రోహిత్, కోహ్లీలకు A+ కేటగిరీ సెంట్రల్ కాంట్రాక్ట్ అందుతుందా..? బీసీసీఐ క్లారిటీ

BCCI Central Contract: ఆడేది ఒకే ఫార్మాట్.. రోహిత్, కోహ్లీలకు A+ కేటగిరీ సెంట్రల్ కాంట్రాక్ట్ అందుతుందా..? బీసీసీఐ క్లారిటీ

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుండి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచారు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచాక ఇద్దరూ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండానే భారత్ టీ20, టెస్ట్ క్రికెట్ ఆడనుంది. అయితే వన్డే క్రికెట్ లో మాత్రం కొన్నేళ్ల పాటు కొనసాగనున్నారు. కేవలం ఒకే ఫార్మాట్ లో కొనసాగుతున్న వీరిద్దరికీ  A+ కేటగిరీ సెంట్రల్ కాంట్రాక్ట్ అందుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్, కోహ్లి సెంట్రల్ కాంట్రాక్ట్ పై వస్తున్న ఊహాగానాలకు క్లారిటీ ఇచ్చారు. "రోహిత్, కోహ్లీ ఇద్దరూ దేశం తరపున ఆడుతున్నారు. వారిని A+ కేటగిరీలో కొనసాగుతారు. వారికి ఆ గ్రేడ్‌కు సంబంధించిన అన్ని సౌకర్యాలు లభిస్తూనే ఉంటాయి. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాతో పాటు వారిని వారిద్దరినీ A+ కేటగిరీలోనే ఉంటారు".అని స్పోర్ట్స్ టాక్ తో జరిగిన ప్రత్యేక సంభాషణలో సైకియా అన్నారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుకు ఎంపికైన క్రికెటర్ల వార్షిత వేతనం విషయానికొస్తే.. ‘A+’ గ్రేడ్ క్రికెటర్లకు రూ.7 కోట్ల శాలరీ, గ్రేడ్ ‘A’ కు ఎంపికైన క్రికెటర్లకు 5 కోట్లు, గ్రేడ్ ‘B’ కి ఎంపికైన క్రికెటర్లకు 3 కోట్లు, గ్రేడ్ ‘C’ కి ఎంపికైన క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం అందుతుంది. కాంట్రాక్టుకు అర్హత సాధించాలంటే ఒక సంవత్సరంలో కనీసం మూడు టెస్ట్ మ్యాచులు, 8 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.     

ఏప్రిల్ 21, 2025న బీసీసీఐ 2024-25 సీజన్కు గానూ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్ జాబితాలో మొత్తం 34 మంది ఆటగాళ్లను నాలుగు వేర్వేరు గ్రేడ్‌లుగా విభజించారు. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ , జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. గ్రేడ్ A+ కేటగిరిని నిలుపుకున్నారు.