త్వరలో తండ్రి కాబోతున్న కోహ్లీ

త్వరలో తండ్రి కాబోతున్న కోహ్లీ

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం వీరాట్ కోహ్లీ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని వీరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ అనుష్కతో కలిసి ఉన్న ఫోటోతో మేము  జనవరి 2021 లో ముగ్గురం కాబోతున్నామని‘ ట్వీట్ చేశాడు. ఇదే విషయాన్ని కోహ్లీ సతీమని అనుష్క కూడా తన ట్విట్టర్లో షేర్ చేసింది.

వీరాట్ కోహ్లీ, అనుష్క 2017 డిసెంబర్ 17 లో ఇటలీలో స్నేహితులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఢిల్లీలో,ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ జరుపుకున్నారు. అనుష్క చివరి సారిగా షారుక్ ఖాన్ ,కత్రినా కైఫ్ తో కలిసి జీరో సినిమాలో నటించింది.