ఆధ్యాత్మిక గురువు చెంతకు విరుష్క

ఆధ్యాత్మిక గురువు చెంతకు విరుష్క

మథుర: టెస్టులకు గుడ్‌‌‌‌బై చెప్పిన విరాట్‌‌‌‌ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి మంగళవారం ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్‌‌‌‌ గోవింద్‌‌‌‌ శరణ్‌‌‌‌ జీ మహారాజ్‌‌‌‌ని కలిశాడు. యూపీలో బృందావన్‌‌‌‌ ధామ్‌‌‌‌లో ప్రేమానంద్‌‌‌‌ నుంచి ఆశీర్వాదం పొందుతున్న వీడియోను ఎక్స్‌‌‌‌లో షేర్‌‌‌‌ చేశారు. ఈ సందర్భంగా ప్రేమానంద్..  మీరు సంతోషంగా ఉన్నారా? అంటూ  కోహ్లీని అడిగారు.

ఆధ్యాత్మిక విముక్తిని పొందడానికి భక్తితో దేవుడి నామాన్ని జపించడం వంటి అంశాలపై గురువు చెప్పిన మాటలను కోహ్లీ, అనుష్క శ్రద్ధగా విన్నారు. వరాహ ఘాట్‌‌‌‌ సమీపంలో ఉన్న శ్రీ రాధా కేలి కుంజ్‌‌‌‌ ఆశ్రమంలో 3గంటలకు పైగా గడిపారు. ఆ తర్వాత ఆశ్రమం నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.