క్రికెట్ లో పరుగులతో ఎన్నో రికార్డ్ లు సృష్టించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సోషల్ మీడియాలోనూ విశేష అభిమానులను సొంతం చేసుకుని మరో ఘనత సాధించాడు. ఇన్ స్టాగ్రామ్ లో 100 మిలియన్ల ఫాలోవర్స్ తో రికార్డ్ సృష్టించాడు. దీంతో ఇండియాలోనే 100 మిలియన్లు(10కోట్ల) ఫాలోవర్స్ ను సంపాదించుకున్న తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించాడు. ఫుల్ బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో 266 మిలియన్లు, లియోమెస్సీ 187 మిలియన్లు, నేమార్ 147 మిలియన్ల తర్వాత అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఆటగాడిగా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. వీరాట్ కోహ్లీ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చొప్రాకు 60 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. కోహ్లీకి ట్విట్టర్లో కూడా 40.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

