Kohli Retirement: రోహిత్ బాటలోనే కోహ్లీ.. టెస్ట్ క్రికెట్కు గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

Kohli Retirement: రోహిత్ బాటలోనే కోహ్లీ.. టెస్ట్ క్రికెట్కు గుడ్‌బై.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కొహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్‌లో తాను తొలిసారి బ్యాగీ బ్లూ డ్రెస్ ధరించి 14 సంవత్సరాలు అయిందని, నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఈ ప్రయాణంలో తీసుకెళ్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదని కోహ్లీ పోస్ట్ చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

టెస్ట్ క్రికెట్ తనను పరీక్షించిందని, తనను తీర్చిదిద్దిందని.. జీవితాంతం తాను మోయాల్సిన పాఠాలను నేర్పిందని కోహ్లీ చెప్పాడు. తన టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ను మళ్లీ ఎప్పుడైనా తిరిగి చూసుకుంటే ముఖంపై చిరునవ్వే ఉంటుందని విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు.

ఇప్పటికే ఇదే నెలలో రోహిత్ శర్మ కూడా టెస్ట్ ఫార్మాట్కు గుడై చెప్పేశాడు. ఇప్పుడు కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియాకు ఈ ఇద్దరి లోటు స్పష్టంగా కనిపిస్తోంది. టీమిండియా అభిమానులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ ను ఒక్కసారి చూసుకుంటే.. 123 టెస్ట్ మ్యాచుల్లో 210 ఇన్నింగ్స్ ఆడాడు. 9230 పరుగులు చేశాడు. 31 హాఫ్ సెంచరీలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలతో కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని అనుభూతులను మిగిల్చింది.

టీమిండియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లండ్‌‌‌‌తో సిరీస్‌‌కు ముందు టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయింది. రోహిత్ శర్మ, కోహ్లీ, గతేడాది రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్ట్ ఫార్మాట్లో టీమిండియాకు కీలక సీనియర్ క్రికెటర్లు దూరమైనట్లయింది. కోహ్లీ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు ఆడే అవకాశం లేకపోవడంతో నాలుగో ప్లేస్‌‌‌‌కు శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, కరుణ్‌‌‌‌ నాయర్‌‌‌‌లో ఒకర్ని ఎంచుకునే చాన్స్‌‌‌‌ ఉంది. సర్ఫరాజ్‌‌‌‌ స్థానం కోసం రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ బలమైన పోటీదారుగా కనిపిస్తున్నాడు. మరోవైపు షమీ టెస్ట్‌‌‌‌ కెరీర్‌‌‌‌పై కూడా డౌట్స్‌‌‌‌ నెలకొన్నాయి. ఈ క్రమంలో షమీకి ప్రత్యామ్నాయంగా మరో బౌలర్‌‌‌‌ను పరీక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి.