
టీమిండియా, ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లో మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఆర్సీబీ తరుఫునే ఆడుతోన్న కోహ్లీ.. ధనాధన్ లీగులో ఇప్పటి వరకు 800 ఫోర్లు కొట్టాడు. తద్వారా.. టీ20 ఫార్మాట్లో ఒకే జట్టు తరుఫున 800 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (మే 24) సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ రికార్డ్ సాధించాడు.
విరాట్ తర్వాత 694 ఫోర్లతో జేమ్స్ విన్స్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. విన్స్ హాంప్‌షైర్ తరపున బరిలోకి దిగాడు. ముంబై తరుఫున 550 ఫోర్లు బాది టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే కోహ్లీ, సాల్ట్ రాణించినప్పటికీ హైదరాబాద్‌పై ఆర్సీబీ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.
ఇక.. కోహ్లీ మాత్రం ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన రన్ మెషిన్.. 143 స్ట్రైక్ రేట్‌తో 548 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో 8 విజయాలు సాధించి ఆర్సీబీ ఫ్లే ఆఫ్స్ చేరుకుంది. లీగ్ లో చివరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. 2025, మే 26 లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
T20ల్లో ఒకే జట్టు తరుఫున అత్యధిక ఫోర్లు కొట్టిన టాప్ 5 బ్యాటర్స్
- RCB తరఫున విరాట్ కోహ్లీ - 801
- హాంప్‌షైర్ తరపున జేమ్స్ విన్స్ - 694
- నాటింగ్‌హామ్‌షైర్ తరఫున అలెక్స్ హేల్స్ - 563
- రోహిత్ శర్మ (MI - 550)
- సస్సెక్స్ తరఫున ల్యూక్ రైట్ - 529