Virat Kohli: ఒకే ఫార్మాట్ ఆడినా బ్రాండ్ తగ్గలేదు.. కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ.12.5 కోట్లు

Virat Kohli: ఒకే ఫార్మాట్ ఆడినా బ్రాండ్ తగ్గలేదు.. కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ.12.5 కోట్లు

ఆటతో పాటు ఆర్జనలోనూ టాప్ లో ఉండడం విరాట్ కోహ్లీకి అలవాటే. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారీ మొత్తం సంపాదిస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 274 మిలియన్ల ఫాలోవర్స్ కలిగివున్న కోహ్లీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ.12.5 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అతను అనేక కంపెనీలకు పెయిడ్ ప్రమోషన్లు చేయగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టా సంపాదనలో విరాట్ కోహ్లీ 14 స్థానంలో ఉండగా.. ఇండియా తరపున అగ్రస్థానంలో ఉన్నాడు. 

ఇన్‌స్టా సంపాదనలో ఫుట్‌బాల్‌ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో (658 మిలియన్‌), మెస్సి (505 మిలియన్‌) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. రొనాల్డో ఒక్కో పోస్టుకు రూ.27 కోట్లు వసూలు చేస్తుండగా.. మెస్సి రూ.22 కోట్లు వసూలు చేస్తున్నారు. కోహ్లీ నికర విలువ రూ.1000 కోట్లకు పైనే ఉన్నట్టు సమాచారం. ఇంస్టాగ్రామ్ సంపాదనలో కోహ్లీ మాత్రమే ఇండియా నుంచి టాప్- 20 లో ఉన్నాడు. 

రూ.80 కోట్ల విలువైన ఇల్లు 

కోహ్లీ ప్రాపర్టీస్ విలువు రూ.1050 కోట్లుగా ఉన్నట్టు సమాచారం. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్‌లో రూ.80 కోట్ల విలువైన మరో ఇల్లు ఉన్నట్లు తెలిపింది. ఇక రన్ మెషిన్ వద్ద ఉన్న కార్ల విలువ రూ.30 కోట్ల పైమాటే. ఆడి, రేంజ్ రోవర్, ఫార్చూనర్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లున్నాయి.

బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల

కోహ్లీకి క్రికెట్‌ పరంగా బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. దీనికి అదనంగా మ్యాచ్ ఫీజుల రూపంలో ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు తీసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డే క్రికెట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇవి కాకుండా ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుపున ఆడుతున్నందకు రూ.21 కోట్ల వేతనం తీసుకుంటున్నాడు.

వ్యాపార ప్రకటనల ద్వారా రోజు రూ.7 నుంచి 10 కోట్లు

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. విరాట్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలో అయ్యే భారతీయుడు. విరాట్ కోహ్లీకి 273 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల అతను అనేక కంపెనీలకు పెయిడ్ ప్రమోషన్లు చేయగలిగాడు. దీని కోసం, విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకే సహకార పోస్ట్‌ను షేర్ చేసినందుకు కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు.

ఇన్‌స్టాలో పోస్ట్ చేసినందుకు విరాట్ ఫీజు

విరాట్ కోహ్లీ భారత క్రికెట్ కు ఫేస్ ఐకాన్ గా మారాడు. ఈ స్టార్ ఇండియన్ బ్యాట్స్ మాన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మీడియా నివేదికల ప్రకారం, విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసినందుకు సుమారు $1.4 మిలియన్లు వసూలు చేస్తాడు, ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.12.5 కోట్లు. విరాట్ కోహ్లీ ఫిలిప్స్, ప్యూమా మరియు ఎంఆర్‌ఎఫ్ టైర్స్‌తో సహా సోషల్ మీడియాలో అనేక ప్రధాన బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తాడు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసినందుకు ఇన్‌స్టాగ్రామ్ ప్రముఖ వ్యక్తులకు భారీ మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే, విరాట్ కోహ్లీ ఒక్కో పోస్ట్‌కు ఎంత అందుకుంటారనే దానిపై ఈ వాదనలను ఎప్పుడూ వెల్లడించలేదు.