కలలో కూడా ఊహించలేదు..11 ఏళ్ల జర్నీపై కోహ్లీ ట్వీట్

కలలో కూడా ఊహించలేదు..11 ఏళ్ల జర్నీపై కోహ్లీ ట్వీట్

పరుగుల యంత్రం, రికార్డుల రారాజు టీమిండియా కెప్టెన్ వీరాట్ కొహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 11 ఏళ్లూ పూర్తి చేసుకున్న సందర్భంగా కొహ్లీ  తన ట్విట్టర్లో స్పందించాడు. ‘తక్కువ సమయంలోనే ఇంత ఎదుగుతానని తాను ఊహించలేదు.దేవుడ ఆశీస్సులతోనే ఇది సాధ్యం అయ్యింది. నా కెరీర్ లో ఎదగడానికి సాయపడిన వారికి రుణపడి ఉంటానని‘ ట్వీట్ చేశాడు కొహ్లీ.

2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డేతో కెరీర్ స్టార్ట్ చేసిన కొహ్లీ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలే. అంచెలంచెలుగా ఎదుగుతూ అధ్బుతమైన బ్యాటింగ్ తీరుతో తక్కువ టైంలోనే  రికార్డులన్నీ బద్దలు కొడుతున్నాడు. అటు టెస్టులు, వన్డేల్లోనూ నంబర్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. జట్టును కూడా నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడు. ఇప్పటి వరకు 77 టెస్టులు ఆడిన కొహ్లీ 25 సెంచరీలతో 6613 పరుగులు చేశాడు. ఇక 239 వన్డేలు ఆడిన కొహ్లీ 43 సెంచరీలతో వన్డేల్లోనే అత్యధిక సెంచరీలు బాదిన సచిన్ టెండుల్కర్ తర్వత రెండో స్థానంలో ఉన్నాడు.  70 టీ 20లు ఆడి 2369 పరుగుుల చేశాడు. వన్డేల్లో భారత్ తరపున 11520 రన్స్ చేసి అత్యధిక రన్స్  చేసిన సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.