హాఫ్ సెంచరీ వద్దు..జట్టు ప్రయోజనాలే ముద్దు

హాఫ్ సెంచరీ వద్దు..జట్టు ప్రయోజనాలే ముద్దు

క్రికెట్లో హాఫ్ సెంచరీలు, సెంచరీలు కొట్టాలని ప్రతీ ఆటగాడు అనుకుంటాడు. అయితే హాఫ్ సెంచరీ లేదా..సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోతే ఆటగాడికి ఎంతో బాధ ఉంటుంది. అయ్యో అర్థ సెంచరీ..సెంచరీ కొట్టలేకపోయామనే ఆవేదన మనసులో కలుగుతుంది. అయితే వీటన్నంటికి  రన్ మషీన్ కోహ్లీ అతీతం. వ్యక్తిగత రికార్డుల కంటే..జట్టు మేలే అతనికి ముఖ్యం.  అతని నిస్వార్థమైన ఆటతీరే కోహ్లీని క్రికెట్ కింగ్ మార్చింది. కోహ్లీ నిస్వార్థమైన ఆటకు..సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మరోసారి వేదికైంది. 

హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో..
ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కోహ్లీ 28 బంతుల్లో 49 పరుగులు చేశాడు. అయితే అతను హాఫ్ సెంచరీ చేయడానికి అవకాశం ఉంది. కారణం టీమిండియా ఇన్నింగ్స్ ముగియడానికి మరో ఓవర్ మిగిలింది. అప్పటికి కోహ్లీ నాన్ స్ట్రైక్లో ఉన్నాడు.  స్ట్రైక్లో దినేష్ కార్తీక్ ఉన్నాడు. ఫైనల్‌ ఓవర్‌లో ఫస్ట్‌ బాల్‌ను దినేష్ కార్తీక్‌  షాట్‌కు ప్రయత్నించాడు. కానీ మిస్ అయింది.  సెకండ్ బాల్ను ఫోర్గా మలిచాడు. మూడో బంతికి పరుగులేమి రాలేదు. తర్వాత బౌలర్ వైడ్ వేశాడు. 4వ బంతిని కార్తీక్ సిక్స్ కొట్టాడు. ఈ సమయంలో కార్తీక్ కోహ్లీ దగ్గరకు వచ్చాడు. మరో రెండు బాల్స్ మిగిలి ఉన్నాయి కదా...5వ బంతికి సింగిల్ తీస్తాను. చివరి బాల్కు హాఫ్ సెంచరీ చేస్తావా అని కార్తీక్ అడిగాడు. కానీ కోహ్లీ మాత్రం కార్తీక్ నిర్ణయాన్ని తిరస్కరించాడు. తన స్కోరు కంటే..జట్టు స్కోరు ముఖ్యమన్నాడు. తర్వాత బంతుల్లో మంచి స్కోరు సాధించమని చెప్పాడు. ఇక 5వ బంతిని ఓవర్‌ ఎక్స్ట్రా కవర్‌ మీదుగా కార్తీక్ సిక్స్‌ కొట్టాడు. లాస్ట్ బాల్కు సింగిల్ తీశాడు. దీంతో చివరకు  భారత్ 3వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

కోహ్లీపై ప్రశంసలు..
తన వ్యక్తిగత ప్రయోజనం కంటే..జట్టు ప్రయోజనంకోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన కోహ్లీపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోహ్లీ అద్భుతమైన క్రికెటర్ అని..తన ఇమేజ్ కంటే..టీమ్ ప్రయోజనమే అతనికి ముఖ్యమని మరోసారి నిరూపితమైందంటున్నారు. స్పోర్టింగ్ స్పిరిట్తో కోహ్లీ అందరి మనసును గెలుచుకున్నాడని మెచ్చుకుంటున్నారు. కోహ్లీ  గతంలోనూ అనేక సార్లు ఇలాంటి త్యాగాలు చేశాడని గుర్తు చేస్తున్నారు.