Virat Kohli: ఆస్ట్రేలియా సిరీస్ ఆడతాడా: విరాట్ ఎక్కడున్నాడు..? ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకాని కోహ్లీ

Virat Kohli: ఆస్ట్రేలియా సిరీస్ ఆడతాడా: విరాట్ ఎక్కడున్నాడు..? ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకాని కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవలే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో జరిగిన ప్రీ-సీజన్ ఫిట్‌నెస్ పరీక్షకు హాజరు కాలేదు. రోహిత్ తో పాటు టీమిండియా క్రికెటర్లు అందరూ ఫిట్ నెస్ టెస్ట్ లో పాసయ్యారు. కానీ ఇప్పటివరకు విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నదో క్లారిటీ లేదు. ఐపీఎల్ తర్వాత విరాట్ కోహ్లీ ఎలాంటి క్రికెట్ ఆడలేదు టెస్ట్ క్రికెట్, టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇంతకీ విరాట్ ఎక్కడనున్నాడో.. ఎప్పుడు ఇండియాకు వస్తాడో ఇప్పుడు చూద్దాం. 

విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న విరాట్.. ఆ తర్వాత లండన్ వెళ్ళాడు. ఇప్పటివరకు ఇండియా తిరిగి రాలేదు. తన ఫ్యామిలీతోనే లండన్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ జూలైలో జరిగిన వింబుల్డన్ మ్యాచ్ చూడడానికి వచ్చాడు. ఆ తర్వాత ఆగస్టు 8న లండన్‌లో షాష్ పటేల్ అనే వ్యక్తితో పూర్తిగా తెల్ల గడ్డంతో ఫోటో దిగి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

36 ఏళ్లకే కోహ్లీ పూర్తిగా తెల్ల గడ్డంతో కనిపించడంతో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాలేదు. టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఆడనుంది. మూడు వన్డేల ఈ సిరీస్ లో కోహ్లీ ఆడడం ఖాయమైంది.   ఈ మధ్యలో భారత జట్టు టీ20 ఫార్మాట్ లో జరగబోయే  ఆసియా కప్ తో పాటు వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నెల చివర్లో కోహ్లీ ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిట్ నెస్ టెస్ట్ పూర్తి చేసుకొని ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు.       

వరల్డ్ నెంబర్ వన్ ఫిట్ నెస్ క్రికెట్ ప్లేయర్ అయినప్పటికీ చూడడానికి ఓల్డ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. 36 ఏళ్ళ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ కు ఇప్పటికే తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఏడాది టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఇండియా తరఫున 123 టెస్టులు ఆడి 9230 రన్స్ చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 ఫిఫ్టీలు ఉన్నాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.