ICC ర్యాంకింగ్స్ : టాప్ లో కోహ్లీ

ICC ర్యాంకింగ్స్ : టాప్ లో కోహ్లీ

దుబాయ్: రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ మరోసారి టాప్ లో నిలిచారు. సోమవారం విడుదల చేసిన ICC కొత్త ర్యాంకింగ్స్ లో కోహ్లీ తన స్థానాన్ని సేఫ్ గా ఉంచుకుని టాప్ లో కొనసాగుతున్నాడు. 928 పాయింట్లతో కోహ్లీ నంబర్ వన్ టెస్టు బ్యాట్స్‌మన్‌ గా కొనసాగుతున్నాడు. సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య జస్ట్ 17 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. న్యూజిలాండ్‌ తో తొలి టెస్టులో స్మిత్(43, 16) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.

భారత టెస్టు ప్లేయర్లు పుజారా(791), రహానె(759) వరుసగా నాలుగు, ఆరు ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. గాయపడి పునరాగమనం కోసం చూస్తున్న యువ స్పీడ్‌స్టర్ జస్ప్రిత్ బుమ్రా ఒక ర్యాంకు దిగజారి ఆరో స్థానంలో నిలిచాడు. టెస్టు ఆల్‌ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండు, అశ్విన్ ఆరులో నిలిచారు.