ICC వన్డే ర్యాంకింగ్స్: కోహ్లీ నంబర్ వన్

ICC వన్డే ర్యాంకింగ్స్: కోహ్లీ నంబర్ వన్

ఇంటర్నేషనల్ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 870పాయింట్లతో టాపర్‌ గా ఉండగా… 842 రేటింగ్‌ పాయింట్లతో రోహిత్  రెండోస్థానంలో ఉన్నాడు. మొదటి రెండుస్థానాల్లో కోహ్లీ, రోహిత్‌ ఉండగా మూడోస్థానంలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 837పాయింట్లతో ఉన్నాడు. 818పాయింట్లతో రాస్‌టేలర్‌ నాలుగోస్థానంలో ఉన్నాడు.

భారత్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. డేవిడ్‌ వార్నర్‌ ఒకస్థానాన్ని మెరుగుపరుచుకుని ఏడోస్థానాన్ని దక్కించుకున్నాడు.

మరోవైపు బౌలర్ల విభాగంలో టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఓ స్థానాన్ని కోల్పోయి మూడోస్థానంలో నిలిచాడు.