శాంటాక్లాజ్ గా విరాట్ కోహ్లీ

శాంటాక్లాజ్ గా విరాట్ కోహ్లీ

క్రిస్మస్ పండుగ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది విద్యుత్ వెలుగులతో..రకరకాల గిఫ్ట్ లతో అలంకరించి క్రిస్మస్ ట్రీ. దీంతో పాటు శాంటాక్లాజ్. తాత వేశంలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తుంటారు కొందరు వ్యక్తులు. దీంతో ఈ పండుగ రోజు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. చిన్నారుల కోసం శాంటాక్లాజ్ గా మారిపోయాడు  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ఎప్పుడూ  బిజీగా ఉండే కోహ్లీ క్రిస్మస్‌ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్‌ చేసుకున్నాడు. కోల్ కతా లోని హోం షల్టర్ అనాథ ఆశ్రమంలోని పిల్లల కోసం ..శాంటా తాతలా వేషం వేసుకుని పిల్లలకు సర్‌ఫ్రైజ్‌ ఇచ్చాడు. వారికి గిఫ్ట్ లు పంచి పెట్టాడు. ఆ తర్వాత వారితో కాసేపు సరదాగా గడిపాడు కోహ్లీ.