IND vs ENG: ఆ ఒక్కడు ఉండుంటే.. లార్డ్స్ టెస్ట్ ఇండియా ఈజీగా గెలిచేది: ఇంగ్లాండ్ మాజీ బౌలర్

IND vs ENG: ఆ ఒక్కడు ఉండుంటే.. లార్డ్స్ టెస్ట్ ఇండియా ఈజీగా గెలిచేది: ఇంగ్లాండ్ మాజీ బౌలర్

బ్రిటన్: ఐదు మ్యాచుల సిరీస్‎లో భాగంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ మొత్తం ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 22 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచును కోల్పోయింది. ఈ క్రమంలో లార్డ్స్ టెస్టులో టీమిండియా ఓటమిపై ఇంగ్లాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ హాట్ కామెంట్స్ చేశాడు. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడి ఉంటే.. భారత్ సులభంగా మ్యాచ్ గెలిచేదన్నాడు.

సిరీస్‎లో ఇప్పటి వరకు జరిగిన మ్యాడు టెస్టుల్లో టీమిండియానే ఆధిప్యతం చెలాయించినప్పటికీ.. ఇంగ్లాండ్ రెండు మ్యాచుల్లో విజయం సాధించిందని.. ఈ లోపంపై భారత్ దృష్టి పెట్టాలని సూచించాడు. సిరీస్‎లో టీమిండియానే ఎక్కువ సెంచరీలు, వికెట్లు తీసింది. కానీ చివరకు మ్యాచ్ ఎలా గెలవాలనే వ్యుహాం ఇంగ్లాండ్‎కు బాగా తెలుసన్నారు.

ఇంగ్లాండ్ మాదిరిగా ఒక సెషన్‎లో ఆట గమనాన్ని మార్చే దారి భారత్ వెతకాలన్నారు. టీమిండియా తనను తాను నమ్మడం ప్రారంభించాలని సూచించాడు. నాల్గో ఇన్సింగ్స్ ఛేజింగ్‎లో విరాట్ కోహ్లీ లాంటి వారు సులభంగా టార్గెట్ పూర్తి చేస్తారని.. లార్డ్స్ టెస్టుల్లో కోహ్లీ ఆడి ఉంటే భారత్ సునాయసంగా విజయం సాధించేదన్నాడు స్టీవ్ హార్మిసన్.

ఇక ఐదు మ్యాచుల సిరీస్‎లో భారత్ 1-2 తేడాతో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో అతిథ్య ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించి తొలి ఓటమికి రివేంజ్ తీర్చుకుంది. లార్డ్స్‎లో జరిగిన మూడో టెస్టులో విజయంతో కంబ్యాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ 1-2 తేడాతో సిరీస్‎లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

2025, జూలై 23న మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని భారత్.. మాంచెస్టర్‌‎లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ ఉవ్విళ్లురుతున్నాయి.