
నిజాయితీగా చెప్పాలంటే హార్దిక్ ఫిజికల్ కండీషన్ చాలా మెరుగుపడింది. టోర్నీలో ఏదో ఓ దశలో కనీసం రెండు ఓవర్లైనా బౌలింగ్ చేస్తాడు. ఆ లోపు మాకు పెద్దగా ఇబ్బంది రాదనే నమ్మకం ఉంది. మిగతా రెండు ఓవర్లకు మేం ఆప్షన్స్ కూడా రెడీ చేసుకున్నాం. కాబట్టి పాండ్యా బౌలింగ్ గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. ఆరో ప్లేస్‌లో పాండ్యా చూపే ప్రభావాన్ని సింగిల్ నైట్‌లో వేరే వారితో భర్తీ చేయలేం. పాండ్యా ఫామ్‌లో ఉంటే ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేస్తాడు. అందుకే ఆరో నంబర్‌లో అతని విలువేంటో మాకు బాగా తెలుసు. ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే పాండ్యాలా మ్యాచ్‌ను ప్రభావితం చేసే ఇన్నింగ్స్‌ను ఎవరూ ఆడలేరు. బౌలింగ్ చేయమని మేం బలవంతం చేయబోం. కానీ అతను రెడీగా ఉంటే మాత్రం టీమ్ కాంబినేషన్ మొత్తం మారిపోతుంది. బలమైన ఫైనల్ ఎలెవన్‌పై ఓ అంచనాకు వచ్చాం. ఐపీఎల్ వల్ల ప్లేయర్లందరూ మంచి టచ్‌లో ఉన్నారు. – విరాట్ కోహ్లీ