
దుబాయ్: వరల్డ్ కప్‌లో చెలరేగిన ‘కింగ్’ విరాట్ కోహ్లీ.. ఐసీసీ వన్డే ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. బుధవారం తాజాగా విడుదల చేసిన బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో విరాట్ (791 పాయింట్లు) నాలుగు నుంచి మూడో ప్లేస్‌లోకి దూసుకొచ్చాడు. మెగా ఈవెంట్‌లో 765 రన్స్ చేయడం కోహ్లీ ర్యాంక్ మెరుగుపడటానికి బాగా దోహదం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (769) నాలుగో ర్యాంక్‌లో ఉండగా, శుభ్‌మన్ గిల్ (826) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బాబర్ ఆజమ్ (824) రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్‌లో హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (699) ఒక్క ప్లేస్ దిగజారి మూడో ర్యాంక్‌లో నిలిచాడు. బుమ్రా (685) నాలుగో ర్యాంక్‌లోనే ఉన్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (667), మహ్మద్ షమీ (648) వరుసగా ఏడు, పదో ర్యాంక్‌లో ఉన్నారు.