కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. తేల్చేసిన వీరేంద్ర సెహ్వాగ్

కోహ్లీకి ఇదే చివరి ఐసీసీ టోర్నీ.. తేల్చేసిన వీరేంద్ర సెహ్వాగ్

ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 విరాట్ కోహ్లీకి చివరి ఐసీసీ టోర్నీనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు గుర్తుగా కోహ్లీకి ఘనమైన వీడ్కోలు ఇవ్వడానికైనా.. భారత జట్టు 2023 వరల్డ్ కప్‌ను గెలవాలని సెహ్వాగ్ తెలిపాడు. నవంబర్ 19న నరేంద్ర మోదీ స్టేడియంలో కోహ్లి వరల్డ్ ట్రోఫీని ముద్దాడుతుంటే చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లు  మాజీ డాషింగ్ ఓపెనర్ వెల్లడించాడు.
 
"2011 వరల్డ్ కప్ సమయంలో మేం సచిన్ కోసం ఆడాం. అతనికి వరల్డ్ కప్‌తో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని జట్టులో ప్రతి ఒక్కరం అనుకున్నాం. ఇప్పుడు కోహ్లీకి అదే వర్తిస్తుంది. జట్టులో ఉన్న ప్రతీ ఒక్కరూ అతని కోసం వరల్డ్ కప్ గెలిచి తీరాలి. అతనెప్పుడూ 100 శాతం కంటే ఎక్కువే కష్టపడ్డాడు. మరోసారి ఇండియాకు వరల్డ్ కప్ అందివ్వడానికి తను అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడు. ఈసారి వరల్డ్ కప్ సాధిస్తే.. అతని జీవితంలో ఓ కలికితు రాయిగా మిగిలిపోతుంది.." అని వరల్డ్ కప్ షెడ్యూల్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ALSO READ:తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..నుజ్జు నుజ్జయిన కారు

Virender Sehwag said, "Virat Kohli is very much similar to Sachin Tendulkar. He steps up at big stages more than any other youngsters". pic.twitter.com/i4rkjVRbed

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2023

చివరిసారి 2011లో భారత గడ్డపై ఈ మెగా టోర్నీ జరగగా.. ధోని కెప్టెన్సీలో టీమిండియా టైటిల్‌ను సొంతం చేసుకుంది. అది అభిమానులకు ఒక ట్రోఫీనే అయినా.. సచిన్‌కు మాత్రం ఓ జ్ఞాపకమే. ఇండియా మ్యాచ్ గెలిచాక.. టీమ్ మేట్స్ సచిన్‌ను భుజాలపై ఎత్తుకొని వాంఖెడే స్టేడియం మొత్తం కలియ తిరిగారు.  ఆరోజు చోటుచేసుకున్న భావోద్వేగ క్షణాలను మాటల్లో వర్ణించలేం. ఆ జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం టీమిండియా ముందుంది.