ముచ్చటగా మరో మూడు వ్యాపారాల్లోకి విశాక ఇండస్ట్రీస్

ముచ్చటగా మరో మూడు వ్యాపారాల్లోకి విశాక ఇండస్ట్రీస్
  • ఆటమ్​లైఫ్​ పేరుతో గ్రీన్​ ప్రొడక్టుల స్టోర్లు
  • దేశమంతటా ఈవీ చార్జింగ్ స్టేషన్లు
  • హోమ్ కన్స్ట్రక్షన్ అవసరాల కోసం వీనెక్స్ట్​ సొల్యూషన్స్

హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్  మూడు కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టనుంది. మంగళవారం నిర్వహించిన కంపెనీ యాన్యువల్​ జనరల్ మీటింగు (ఏజీఎం) లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త బిజినెస్​ల కోసం టచ్ పాయింట్లను ఏర్పాటు చేయడం వల్ల పాత బిజినెస్​లు మరింత ఎదగడానికి అవకాశాలు ఉంటాయని కంపెనీ భావిస్తోంది. పర్యావరణ అనుకూలమైన గ్రీన్​ప్రొడక్టులను అమ్మడానికి ఆటమ్​లైఫ్​ పేరుతో రిటైల్​ స్టోర్లను, ఆటమ్ చార్జ్ పేరుతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను, ప్రి–ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్​ సొల్యూషన్స్ అందించడానికి వీనెక్స్ట్​ సొల్యూషన్స్ ను  ఏర్పాటు చేస్తారు. 

ఆటమ్ లైఫ్ రిటైల్​ స్టోర్లు...
వీనెక్స్ట్ బ్రాండ్ల బిల్డింగ్ మెటీరియల్, ఆటమ్ సోలార్​రూఫ్, యార్న్, సేంద్రియ డిటర్జెంట్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, కన్జూమబుల్స్, వంటసామగ్రి, కట్లరీ వంటి ప్రొడక్టులన్నింటినీ ఈ స్టోర్లలో కొనుక్కోవచ్చు. ఇవన్నీ పర్యావరణ అనుకూల మెటీరియల్‌‌తో తయారైన ప్రొడక్టులు. మన్నిక కూడా ఎక్కువని విశాక తెలిపింది. 

ఆటమ్ చార్జ్
ఎలక్ట్రిక్ వెహికల్స్​కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విశాక ఇండస్ట్రీస్ ఇండియా అంతటా ఆటమ్​ చార్జ్​ పేరుతో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. మరో విశేషం ఏమిటంటే ఇవి సోలార్ పవర్‌‌తో నడుస్తాయి. క్లీన్ ఎనర్జీని, ఈవీలను ఎంకరేజ్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇతర కంపెనీలు ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్లన్నీ థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి వచ్చే సాధారణ కరెంటుతో  నడుస్తాయి. ఆటమ్ చార్జ్ స్టేషన్ల ఏర్పాటు కోసం  చార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్లతో విశాక ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇతర సోలార్ ప్రొడక్టులతో పోలిస్తే విశాక ఆటమ్ సోలార్ రూఫ్ 40 శాతం ఎక్కువ కరెంటును తయారు చేస్తుంది. ఆటమ్ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణానికి సోలార్ రూఫ్​లను, ఫైబర్ సిమెంట్ బోర్డులు ( వీనెక్స్ట్ బోర్డులు) వాడుతారు.  మొదట దేశంలోని పెద్ద సిటీల్లో పది ఆటమ్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్లను, బైకులను, స్కూటర్లను చార్జ్ చేసుకోవచ్చు. 

వీనెక్స్ట్ సొల్యూషన్స్
ప్రి–ఫ్యాబ్రికేటెడ్ బిల్డింగ్స్ మొదలుకొని ఇంటీరియర్ ఫర్నిషింగ్​ అవసరాలను తీర్చడానికి వీనెక్స్ట్ సొల్యూషన్స్​ను అందుబాటులోకి తెస్తారు. పర్యావరణానికి అనుకూలమైన ప్రొడక్టుల ద్వారానే ఈ సేవలు అందిస్తారు. ఈ సందర్భంగా విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గడ్డం వంశీ మాట్లాడుతూ కొత్త వ్యాపారాలు ఆటమ్​లైఫ్, ఆటమ్ చార్జ్, వీనెక్స్ట్ వల్ల తమ పాత వ్యాపారాలకూ మేలు జరుగుతుందని చెప్పారు. కంపెనీ ఫ్యూచర్​కు ఇవి ఎంతో ముఖ్యమని కామెంట్ చేశారు. సస్టెనబుల్ ప్రొడక్టులు తమ కంపెనీ ఎదుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. విశాక ఇండస్ట్రీ వండర్ యార్న్ (ప్లాస్టిక్‌‌తో తయారు చేస్తారు) వంటి పర్యావరణ అనుకూల ప్రొడక్టుల తయారీ ద్వారా పరోక్షంగా 50 వేల చెట్లను కాపాడింది.