ఆ డబ్బుతో విశాక ఇండస్ట్రీస్​కు సంబంధం లేదు

ఆ డబ్బుతో విశాక ఇండస్ట్రీస్​కు సంబంధం లేదు
  •     రాజకీయ రంగు పులిమేందుకే మాజీ ఎంపీ వివేక్​ పేరు లాగారు
  •     హైదరాబాద్​ సీపీ ప్రెస్​నోట్​ను ఖండిస్తున్నం: విశాక ఇండస్ట్రీస్

హైదరాబాద్, వెలుగు: ఇటీవల హైదరాబాద్​లో పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బుతో విశాక ఇండస్ట్రీస్  ఓనర్ మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామికి ఎటువంటి సంబంధం లేదని ఆ కంపెనీ స్పష్టం చేసింది. ఆ అంశానికి రాజకీయ రంగు పులిమేందుకు కావాలనే వివేక్​ పేరును ప్రచారంలోకి తెచ్చారని పేర్కొంది. ఈ మేరకు విశాక ఇండస్ట్రీస్​ చీఫ్​ ఫైనాన్షియల్​ ఆఫీసర్​ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ విడుదల చేసిన ప్రెస్​నోట్​లో వివేక్ పేరును ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.