
విశాఖ నుంచి ఢిల్లీ బయల్దేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ రాజమండ్రి స్టేషన్లో గంటన్నర సేపు ఆగిపోయింది. ఏసీ పని చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన చేశారు. ఏసీ ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అయితే తాడేపల్లి గూడెంలో ఏసీ రిపేర్ చేస్తామని రైల్వే అధికారులు చెప్పడంతో ప్రయాణికులు సరే అన్నారు. విశాఖపట్నం నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు బయలు దేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ మద్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఏసీ రిపేర్ చేసిన తర్వాత రైలు బయల్దేరింది.