అంబానీని టార్గెట్ చేసిన అసిమ్ మునీర్.. ఈసారి రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ పైనే దాడి..!

అంబానీని టార్గెట్ చేసిన అసిమ్ మునీర్.. ఈసారి రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ పైనే దాడి..!

పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెండోసారి అమెరికా పర్యటనలో ఉన్నారు. యుద్ధం తర్వాత అమెరికా అండ చూసుకుని మరోసారి అణ్వాయుధ దాడులు చేస్తామంటూ మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు చూస్తున్నాయి. పాక్ జోలికొస్తే తామతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేయటానికి అస్సలు వెనకాడేదిలేదని మునీర్ చెప్పారు.

అయితే ఇక్కడితో ఆగని మునీర్ ఈసారి ఇండియాతో వార్ వస్తే ఇక్కడి కీలక ఆర్థిక మౌలిక సదుపాయాలను టార్గెట్ చేస్తామని చెప్పినట్లు ఫ్లోరిడా డిన్నర్ మీటింగ్ లో చెప్పినట్లు నివేదించబడింది. ముఖేష్ అంబానీకి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్ జామ్‌నగర్‌లో ఉండగా భవిష్యత్తులో దానిపై దాడిచేస్తామని చేసిన కామెంట్స్ బయటకు రావటం ఆందోళనలు పెంచుతున్నాయి. 

పాకిస్థాన్ లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా కొనసాగుతున్న మునీర్ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలతో అక్కడి నేతలు మళ్లీ యుద్ధానికి సిద్ధం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో కూడా సోమవారం మరోసారి యుద్ధం తప్పదంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ సిందు జలాల విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. పాక్ కి రావాల్సిన సిందు జలాలను భారత్ మళ్లించటం తమ చరిత్ర, నాగరికతపై జరుగుతున్న దాడిగా బుట్టో పేర్కొన్నారు. మరోసారి నీటి కోసం యుద్ధం చేస్తా తాము ఆరు నదులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు బుట్టో.

ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన తర్వాత భారత ప్రభుత్వం 1960ల నాటి సిందు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. హోం మంత్రి అమిత్ షా కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదని.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంతో తమ వైఖరి కఠినంగానే ఉంటుందని చెప్పారు.