ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి

ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి

ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ప్రకటించారు. బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశం తర్వాత సీఎంగా విష్ణు దేవ్ సాయిని ప్రకటించారు. ఈ సమావేశంలో సీఎం పేరు ఖరారు కాగానే ఢిల్లీ నుంచి ఛత్తీస్ గఢ్ సీఎం గా విష్ణుదేవ్ సాయి పేరును ఆమోదించారు. 

సీఎం గా విష్ణుదేవ్ సాయి ప్రకటనకు ముందు ..ఈసారి బీజేపీ గిరిజనుడిని సీఎం చేస్తుందా?..గిరిజనేతరులకు అవకాశం ఇస్తుందా ?..  మహిళకు అవకాశం ఇస్తుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఛత్తీస్ గఢ్ సీఎం రేసులో చాలామంది నేతలు పోటీ పడ్డారు. మాజీసీఎం రమణసింగ్ తోపాటు అరుణ్ పావ్, విష్ణేదేవ్ సాయి, ఓపీ చౌదరి, రేణుకాసింగ్ ఉన్నారు.

వెనకబడిన వర్గాల నుంచి కాకుండా.. ఓబీసీ, గిరిజన ముఖ్యమంత్రి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. గిరిజన సీఎంలుగా కేంద్ర మాజీ మంత్రులు విష్ణుదేవ్ సాయి, రేణుకాసింగ్ ల పేర్లు ముందంజలో ఉండగా.. ఓబీసీ వర్గం నుంచి ఓపీ చౌదరి, అరుణ్ పావో  పేర్లు వినిపించాయి. అయితే సీఎం రేసులో బీజేపీ అధిష్టానం గిరిజన సామాజిక వర్గం నేత వైపే మొగ్గు చూపింది. గిరిజన నేత అయిన విష్ణుదేవ్ సాయిని ఛత్తీస్ గఢ్ సీఎంగా ప్రకటించింది.