టికెట్ రేట్స్‌‌‌‌పై చర్చ జరగాలి

టికెట్ రేట్స్‌‌‌‌పై చర్చ జరగాలి

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యం, అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన కర్తవ్యం అన్నారు ‘మా’ ప్రెసిడెంట్‌‌‌‌ మంచు విష్ణు. నిన్న ఉదయం ‘మా’ సభ్యులకు హైదరాబాద్‌‌‌‌లోని ఏఐజీ హాస్పిటల్‌‌లో హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో మంచు విష్ణు మాట్లాడుతూ ‘నేను ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు పూర్తయింది. ‘మా‌‌‌‌’ సభ్యుల వెల్ఫేర్, హెల్త్ నా ప్రధాన కర్తవ్యం. అందుకే ఈ ఆరు నెలల్లో రెండోసారి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మెంబర్‌‌‌‌షిప్ విషయంలోనూ రూల్స్ కఠినతరం చేశాం. మరో ఆరునెలలలోపే ‘మా’ బిల్డింగ్‌‌‌‌కి కూడా భూమి పూజ చేస్తాము. ఇక టికెట్ రేట్స్‌‌‌‌ విషయంలో నేను మాట్లాడలేదని చాలా మంది విమర్శించారు. పెంచితే కొందరికి.. తగ్గిస్తే మరికొందరికి ఇబ్బందులున్నాయి. ప్రేక్షకులు బంగారు బాతుల్లాంటి వారు. వాళ్లు ఇచ్చింది తీసుకోవాలే కానీ కోసుకు తినాలనుకోకూడదు. టికెట్‌‌‌‌ రేట్స్‌‌‌‌ విషయంలో ఏది తప్పు, ఏది ఒప్పు అనే దానిపై చర్చ జరగాల్సి ఉంది. తెలుగు ఫిల్మ్‌‌‌‌ ప్రొడ్యూసర్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌, ఫిల్మ్‌‌‌‌ ఛాంబర్‌‌‌‌ సహా అందరూ కలిసి ఏ స్థాయిలో రేట్లు పెరగాలి అనే విషయంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నరేష్‌‌‌‌, మాదాల రవి, డా.నాగేశ్వరరెడ్డి,శివ బాలాజీ పాల్గొన్నారు.