ఆసక్తిరేపుతున్న 'మట్టి కుస్తీ' గ్లింప్స్

ఆసక్తిరేపుతున్న 'మట్టి కుస్తీ' గ్లింప్స్

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఆర్టీ టీమ్‌ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై చెల్ల అయ్యావు దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'మట్టి కుస్తీ'. ఈ రోజు విష్ణు విశాల్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ సూచిస్తునట్లుగా ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ రెజ్లర్ గా పరిచయం అయ్యారు. విష్ణు విశాల్ బైక్ నడుపుతూ.. విలన్స్ ను కొడుతూ పవర్ ఫుల్ గా కనిపించారు. 

చివర్లో రెజ్లింగ్ రింగ్‌లో తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది. ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ గా నిలిచింది. 'మట్టి కుస్తీ' స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో రూపుదిద్దుకుంటుంది. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రిచర్డ్ ఎం నాథన్  సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న ఎడిటర్ గా పనిచేస్తున్నారు.